భక్తి హారతి పాటలు

వినాయక, శివ మంగళ హారతులు మరియు ప్రాతఃకాల, మధ్యాహ్న, సాయంకాల, శయన హారతి పాటలు.

వినాయక మంగళ హారతి
శివుని మంగళ హారతి
ప్రాతఃకాల హారతి - కాకడ హారతి
మధ్యాహ్నకాల హారతి - మధ్యాహ్న హారతి
సాయంకాల హారతి - ధూప హారతి
శయన హారతి - శేజ్ హారతి
పార్వతి దేవి హారతి
గాయత్రి దేవి హారతి
శ్రీ లలితా దేవి హారతి
శ్రీ అన్నపూర్ణా దేవి హారతి
ఓంకార రూపిణి క్లీంకార వాసిని
శ్రీ జయ మంగళ గౌరీ దేవి హారతి
శ్రీ భ్రమరాంభ దేవి హారతి
శ్రీ లక్ష్మీ అమ్మావారి హారతి
సరస్వతి దేవి హారతి
శ్రీ వేంకటేశ మంగళాశాసనం

వినాయక మంగళ హారతి

శ్రీ శంభుతనయునకు సిద్ధిగణనాథునకు- వాసిగల దేవతావంద్యునకును |

ఆ సరసవిద్యలకు ఆదిగురువైనట్టి – భూసురోత్తమ లోకపూజ్యునకును ||

| జయ మంగళం నిత్య శుభ మంగళం |

నేరేడు మారేడు నెలవంక మామిడి – దూర్వార చెంగల్వ ఉత్తరేణు |

వేరువేరుగ దెచ్చి వేడ్కతో పూజింతు – పర్వమున దేవగణపతికి నిపుడు || జయ ||

సుచిరముగ భాద్రపద శుద్ధచవితి యందు – పొసగ సజ్జనులచే పూజకొల్తు |

శశిజూడరాదన్న జేకొంటి నొక వ్రతము – పర్వమున దేవగణపతికి నిపుడు || జయ ||

పానకము వడపప్పు పనస మామిడిపండ్లు – దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు |

తేనెతో మాగిన తియ్య మామిడిపండ్లు – మాకు బుద్ధినిచ్చు గణపతికి నిపుడు || జయ ||

ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య – ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు |

కమ్మని నెయ్యియు కడుముద్దపప్పును – బొజ్జవిరుగగ దినుచు పొరలుకొనుచు || జయ ||

వెండిపళ్ళెరములో వెయివేల ముత్యాలు – కొండలుగ నీలములు కలియబోసి |

మెండుగను హారములు మెడనిండ వేసికొని – దండిగా నీకిత్తు ధవళారతి || జయ ||

పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు – గంధాల నినుగొల్తు కస్తూరినీ |

ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తంబున – పర్వమున దేవగణపతికి నిపుడు || జయ ||

ఏకదంతంబును ఎల్లగజవదనంబు – బాగయిన తొండంబు వలపు కడుపు |

జోకయున మూషికము సొరిదినెక్కాడుచును – భవ్యుడగు దేవగణపతికి నిపుడు || జయ ||

మంగళము మంగళము మార్తాండతేజునకు – మంగళము సర్వజనవందితునకు |

మంగళము ముల్లోక మహితసంచారునకు – మంగళము దేవగణపతికి నిపుడు || జయ ||

సిద్ధివిఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు – ఒనరంగ నిరువదియొక్క పత్రి |

దానిమ్మ మరువము దర్భ విష్ణుక్రాంత – యుమ్మెత్త దూర్వార యుత్తరేణి |

కలువలు మారేడు గన్నేరు జిల్లేడు – దేవకాంచన రేగు దేవదారు |

జాజి బలురక్కసి జమ్మిదాచెనపువ్వు – గరిక మాచిపత్రి మంచిమొలక || జయ ||

అగరు గంధాక్షతల్ ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములును |

భాద్రపద శుద్ధచవితిని పగటివేళ కుడుములు నానుబాలు ఉండ్రాళ్ళు పప్పు

పాయసము జున్ను దేనెను పంక్తిమీర కోరిపూజింతు నిన్నెపుడు కోర్కెలలర || జయ ||

బంగారుచెంబుతో గంగోదకముదెచ్చి సంగతిగ శిశువునకు జలకమార్చి |

మల్లెపువ్వులు దెచ్చి మురహరుని పూజింతు రంగైన నా ప్రాణాలింగమునకు || జయ ||

పట్టుచీరలు మంచి పాడిపంటలుగల్గి గట్టిగా కనకములు కరులు హరులు

ఇష్టసంపదలిచ్చి యేలినస్వామికి పట్టభద్రుని దేవ గణపతికి నిపుడు || జయ ||

ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తుసమితి గూర్చి

నిక్కముగ మనమును నీయందె నే నిల్పి ఎక్కువగు పూజలాలింపజేతు || జయ ||

మల్లెలా మొల్లలా మంచిసంపెంగలా చల్లనైనా గంధసారములను

ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగ నే జేతు కోరి విఘ్నేశ || జయ ||

దేవాదిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును

దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు భవ్యుడగు దేవగణపతికి నిపుడు || జయ ||

చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను

పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనెపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను ||జయ ||

మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు

నేరేడు నెలవంది టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు చనువుతోను || జయ ||

ఓ బొజ్జగణపతి ఓర్పుతో రక్షించి కాచి మమ్మేలుమీ కరుణతోను

మాపాలగలవని మహిమీద నెల్లపుడు కొనియాడుచుందుము కోర్కెదీర || జయ ||

| జయ మంగళం నిత్య శుభ మంగళం |