వ్రతములు

వినాయకచవితి, కేదారేశ్వర, సోమవార, సరస్వతీ, రథసప్తమి వంటి వ్రతకల్పాలు.

వినాయకచవితి వ్రత విధానం
శ్రీ కేదారేశ్వర వ్రతకల్పము
ఏడు శనివారాల వ్రత నియమం
సోమవారాల వ్రతకల్పము
సరస్వతీ వ్రతకల్పము
రథసప్తమీ వ్రతకల్పము
శ్రీ కృష్ణాష్ణమీ వ్రతకల్పము
శ్రీరామనవమి వ్రతము
గరుడ పంచమీ వ్రతకల్పము
మంగళగౌరీ వ్రతం

వినాయకచవితి వ్రత విధానం

వినాయక చవితి రోజు ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని, నీళ్ళతో కడగాలి. తరువాత ఇంటిలోని సభ్యులందరూ తలంటుకుని స్నానం చేసి, ఉతికిన బట్టలు ధరించాలి. గుమ్మాలను మామిడాకులతో అలంకరించుకోవాలి. వ్రతం చేయాలనుకునే ప్రదేశంలో పీట వేసి, పసుపుతో విఘ్నేశ్వరుని చేసి, తమలపాకుల చివర తూర్పు వైపుకుగానీ, ఉత్తరం వైపుకు గానీ ఉంచుకోవాలి. ఒక పళ్ళెంలో బియ్యం పోసుకుని వాటిపై తమలపాకులను పెట్టుకోవాలి. అగరవత్తులు వెలిగించి దీపారాధన చేసిన తరువాత ...

ఓం దేవీంవాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపా: పశవో వదంతి సానో మంద్రేష మూర్ణం దుహానాధే నుర్వాగాస్మానుప సుష్టుతైతు అయం ముహూర్తస్సుముహూర్తోస్తు

శ్లోకం:

యశ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళాః తయోః సంస్మరణా త్పుంసాం సర్వతో జయమంగళం అని చదవాలి.

పీటపై వినాయకుడి విగ్రహాన్ని ఉంచుకుని. పాలవెల్లికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, దాన్ని విఘ్నేశ్వరుని తలపై వచ్చేలా తాళ్ళు కట్టి పైన కట్టుకోవాలి. పాలవెల్లిపై పత్రి వేసుకుని పాలవెల్లి నలువైపులా మొక్కజోన్ను పొత్తులను కట్టుకుని, పళ్ళతొ అలంకరించుకోవాలి. వినాయకుడికి ఉండ్రాళ్ళు, కుడుములు, గారెలు, పాయసం మొదలైన పిండివంటలు చేసుకుని దగ్గర పెట్టుకోవాలి. వినాయకుడి ప్రతిమ ఎదురుగా పీటపై కొన్ని బియ్యం పోసుకుని దానిపై రాగి, వెండి లేదా మట్టి పాత్రకు పసుపు రాసి, పాత్రపై జాకెట్టు గుడ్డ వేసి, మామిడాకులు కొన్ని ఉంచి దానిపై కొబ్బరికాయ ఉంచి కలశం ఏర్పాటు చేసుకోవాలి.

పూజకు కావలసిన పూజాసామాగ్రి :

పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, పూలు, పూల దండలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం లేదా చక్కెర, పంచామృతం, తోరం, కుందులు, నెయ్యి, నూనె, దీపారాధనకు వత్తులు, 21 రకాల ఆకులు (పత్రి), ఒక గ్లాసులో చెంచా లేదా ఉద్దరిణ, పళ్ళెం పెట్టుకోవాలి (ఆచమనం చేయడానికి). మూడు తమలపాకులు, రెండు వక్కలు, రెండు పళ్ళు, దక్షిణ ఉంచుకోవాలి. ఆచమనం చేసిన తరువాత చేతులు తుడుచుకోవడానికి ఒక తువ్వాలు. పూజ చేసేవాళ్ళు బొట్టు పెట్టుకుని పీటపై కూర్చోవాలి.

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే!!

అయం మొహోర్తః సుముహోర్తోస్తు

తదేవలగ్నం సుదినం తదేవ

తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం తదేవ

లక్ష్మీపతేతేంఘియుగం స్మరామి

యశ్శివోనామరోపాభ్యాం యాదేవీ సర్వమంగళా తయో స్సంస్మరణాత్సుంసాం సర్వతో జయమంగళమ్

అని చదువుతూ పీటమీద తూర్పుముఖంగా కూర్చోవాలి. పసుపుతో చేసిన వినాయకుడికి కుంకుమబొట్టు పెట్టి అక్షింతలు చల్లి నమస్కరించాలి.

ముందుగా పసుపు (హారిద్ర) గణపతి పూజా విధానాన్ని పూజ విధానం పూర్తి చేయాలి:

ప్రార్థన :

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శ్శూర్పకర్ణో, హేరంబః స్కంద పూర్వజః అని చదివి పసుపు గణపతి దగ్గర తాంబూలాలు ఉంచాలి. అక్షితలు తీసుకుని పసుపు గణపతిపై వేసి నమస్కరిస్తూ.

సుమూహుర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అనుకూల్య ఫలసిద్ధిరస్తూ అని చెప్పాలి.

ఆచమనం :

ఆచమ్యా ఓం కేశవాయస్వాహా (స్త్రీలయితే కేశవాయనమః అనాలి) ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా అని చదువుతూ ఉద్దరిణతో కుడి అరచేతిలో నీరు పోసుకుని త్రాగిన తరువాత మళ్ళీ నీళ్ళు తీసుకుని కుడిచేతిని కడుక్కోవాలి. ఇలా మూడుసార్లు ఆచమనం చేయాలి.

ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్తనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః

భూతోచ్చాటన :

ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః

ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే

అని చదివి ... అక్షతలు వాసన చూసి, భార్య ఎడమచేతి పక్కనుంచి వెనక్కు వదలాలి. మిగతా వాళ్ళు కుడిచేతి పక్కనుంచి వెనక్కు వదలాలి. తరువాత ప్రాణాయామం చేయాలి.

దీపారాధన :

దీపం వెలిగించి, పూలు, అక్షితలు వేసి నమస్కారం చేయాలి. (ఈ క్రింది మంత్రాలు చదువుతూ పూలు, అక్షితలు పసుపు గణపతిపై వేయాలి)

ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, ఓం సీతారామాభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమోనమః.

సంకల్పం :

ఓం మమోపాత్త సమస్త దురతక్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం, శుభే శోభననే అభ్యుదయ ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య, అద్యబ్రాహ్మణః, ద్వితీయపరార్థే, శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే భరతఖండే, మేరో ర్ధక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య (తెలంగాణవాళ్ళు వాయువ్య ప్రదేశ్ అని, రాయలసీమవాళ్ళు ఆగ్నేయ ప్రదేశ్ అని, కోస్తాంధ్ర వాళ్ళు ఈశాన్య ప్రదేశ్ అని చదవుకోవాలి) ప్రదేశే, శోభన గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిదౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తిశ్రీ మన్మథనామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిధౌ గురువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిదౌ శ్రీమాన్ ... (పేరు) గోత్రోద్భవ (గోత్రం చెప్పుకోవాలి) ... నామధేయస్య, ధర్మపత్నీసమేతః, (భార్యపేరుతో మీ పేరు కలిపి చెప్పుకోవాలి) మమ సకుటుంబస్య, క్షేమ, స్థైర్య విజయ అభయాయురారోగ్యైశ్వర్యాభి వృద్యర్థం, ధర్మార్థ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థసిధ్యర్థం, పుత్రపౌత్రాభి వృద్ధ్యర్థం, సర్వాభీష్ట సిద్ధార్థం, లోకకళ్యాణార్థం శ్రీవిఘ్నేశ్వర పూజాం కరిష్యే.

కలశ పూజ :

ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం, శ్రీవిఘ్నేశ్వర పూజాం కరిష్యే. అని చెప్పి అక్షతలు నీళ్ళు వదలాలి. కలశానికి గంధం, కుంకుమతో బొట్టుపెట్టాలి. కలశంలో గంధం, పువ్వులు, అక్షతలు వేయాలి.

దేవతీర్థాద్యావహనము:

కలశస్య ముఖే విష్ణు: కంఠే రుద్ర నమాశ్రితః మూలో తత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః కుక్షౌతుసాగరాః సర్వ్ సప్తద్వీపా వసుంధరా రుగ్వేదోథయజుర్వేదః సామవేదోహ్యధర్వణః అంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

కలశంలోని నీటిని తమలపాకుతో కలుపుతూ

గంగేచ యమునేకృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు !! కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య ఏవమాత్మానంచ సంప్రోక్ష్య

తమలపాకుతో కలశంలోని నీటిని పూజాద్రవ్యాల మీదా, దేవుడిమీద, తమమీద కొద్దిగా చిలకరించుకోవాలి.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమోనమః ప్రాణప్రతిష్టాపన మొహూర్తః సుముహోర్తోస్తు.

అని గణపతి విగ్రహంపై అక్షతలు వేయాలి.

స్తిరోభవ వరదోభవ సుముఖోభవ సుప్రసన్నోభవ స్తిరాసనం కురు అని అక్షితలు వేసి నమస్కారం చేయాలి.

పువ్వులు రెండు చేతుల్లోకి తీసుకుని

గణానాంత్వా గణపతిగ్ం హవామహే, కవిం కవీనా ముపమశ్రవస్తమమ్ జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్సత అనశ్రుణ్వన్నూతిభిస్సీద సాదనమ్!!

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనం సమర్పయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి పాదయో: పాద్యం సమర్పయామి ... హస్తయో: ఆర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి

ఉపచారికస్నానం :

కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళు కొద్దిగా గణపతిమీద చల్లాలి.

శ్రీ మహాగణాధిపతయే నమః - స్నానం సమర్పయామి

స్నానాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి

శ్రీ మహాగానాదిపర్తయే నమః - వస్త్రం సమర్పయామి

శ్రీ మహాగణాధిపతయే నమః - యజ్ఞోపవీతం సమర్పయామి,

శ్రీ మహాగణాధిపతయే నమః - శ్రీగంధాన్ ధారయామి,

శ్రీ మహాగణాధిపతయే నమః - పుష్పై: పూజయామి

శ్రీ మహాగణాధిపతయే నమః - నానావిధ పరిమళ పత్రపుష్పాక్షతాన్ సమర్పయామి

శ్రీ మహాగణాధిపతయే నమః - దూపమాఘ్రాపయామి (ధూపం చూపించాలి)

శ్రీ మహాగణాధిపతయే నమః - దీపం దర్శయామి (దీపం చూపించాలి) ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి

శ్రీ మహాగణాధిపతయే నమః - తాంబూలం సమర్పయామి

శ్రీ మహాగణాధిపతయే నమః - నీరాజనం సమర్పయామి (హారతి ఇచ్చి కళ్ళకు అద్దుకోవాలి)

తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి: ప్రచోదయాత్ శ్రీ మహాగణాధిపతయే నమః ... మంత్రపుష్పం సమర్పయామి

శ్రీ మహాగణాధిపతయే నమః - ఛత్రమచ్చాదయామి

చామరం వీచయామి - నృత్యం దర్శయామి

గీతామాశ్రావయామి - వాద్యం ఘోశాయామి

ఆశ్వానారోహయామి - గాజానారోహయామి

శకటానారోహయామి - ఆందోళికానారోహయామి

అని అక్షితలు వేయాలి

సమస్త రాజోపచార శక్త్యుపచార భక్త్యుపచార పూజాస్సమర్పయామి

అని నీళ్ళు అక్షితలు పళ్ళెంలో వదలాలి.

శ్రీ మహాగణపతి దేవతా స్సుప్రతస్సుప్రసన్నో వరదో భూత్వా వరదో భవతు ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్త్వితి భవంతో ర్రువంతు ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు.

శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్లామి పసుపు గమపతి పూజాక్షతలు శిరసున ధరించాలి శ్రీ మహాగణాధిపతయే నమః యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయచ. అని అక్షతలు వేసి నమస్కారం చేయాలి.

ఇక్కడికి హరిద్రా గణపతి లేదా మహాగణపతి పూజ పూర్తయింది.

వరసిద్ధి వినాయకవ్రత ప్రారంభం:

ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః ప్రాణప్రతిష్ఠాపాన ముహూర్త స్సుముహోర్తోస్తూ అని మట్టిగణపతి విగ్రహం దగ్గర అక్షతలు వేయాలి.

స్వామిస్ సర్వజగన్నాథ యావత్సూజావసానకం తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు!!

స్తిరోభవ వరదోభవ ప్రసీద ప్రసీద

(అని వినాయకుడి విగ్రహం దగ్గర అక్షతలు, పూలు వేసి నమస్కరించాలి)

షోడశోపచార పూజ:

భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమాహం భజే!! ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకమ్!!

ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకమ్!!

ధ్యానం:

ధ్యాయే ద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితమ్!! ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి

ఆవాహనం:

అత్రాగచ్చ జగద్వన్ద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భస్థసముద్భవ ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమః ఆవాహయామి (అక్షతలు వేయాలి)

ఆసనం:

మౌక్రికై: పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్న సింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినేనమః ఆసనం సమర్పయామి (అక్షతలు లేదా పూలు వేయాలి)

అర్ఘ్యం:

గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గన్దపుష్పాక్షతైర్యుతమ్ ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినేనమః ఆర్ఘ్యం సమర్పయామి (తమలపాకుతో స్వామిపైన నీళ్ళు చల్లాలి)

పాద్యం:

గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భాక్తాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః పాద్యం సమర్పయామి (మళ్ళీ కొంచెం నీటిని స్వామికి చూపించి స్వామి పాదాలముందుంచాలి)

ఆచమనీయం:

అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత గృహాణాచమనందేవా తుభ్యందత్తం మయా ప్రభో ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమః ఆచమనీయం సమర్పయామి (కొంచెం నీటిని స్వామిపై చల్లాలి)

మధుపర్కం :

దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్ మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమః మధుపర్కం సమర్పయామి (పత్తి, దూది)తో చేసిన పెద్ద వత్తుకి మధ్యమధ్యలో పసుపు, కుంకుమ పూసి స్వామివారికి సమర్పించాలి)

స్నానం:

పంచామృతైర్దేవ గృహాన గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత పంచామృత స్నానం సమర్పయామి (తేనె, పెరుగు, నెయ్యి, పాలు, చెరుకురసం కలిపి స్వామి విగ్రహంపై చల్లాలి. కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని స్వామివారిపై చల్లాలి)

గంగాది సర్వతీర్థేభ్యః అహృతైరమలైర్జలై: స్నానం కురుష్వభగవన్ ఉమాపుత్ర నమోస్తుతే

ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమః శుద్దోదక స్నానం సమర్పయామి (కొంచెం నీటిని స్వామిపై చల్లాలి)

వస్త్రం :

రక్తవస్త్రద్వయంచారు దేవయోగ్యంచ మంగళం శుభప్రద గృహాణత్వం లమ్బోదర హరాత్మజ ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమః వస్త్రయుగ్మం సమర్పయామి (నూతన వస్త్రం లేదా పత్తికి పసుపు, కుంకుమ రాసి దాన్నే వస్త్రంగా సమర్పించాలి)

యజ్ఞోపవీతం:

రాజితం బ్రహ్మసూత్రంచ కాంచనం చోత్తరీయకం గృహాన దేవా సర్వజ్ఞ భక్తానామిష్టదాయక ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమః యజ్ఞోపవీతం సమర్పయామి (దూదితో చేసిన పెద్ద వత్తుకి మధ్యమధ్యలో పసుపు, కుంకుమ పూసి స్వామివారికి సమర్పించాలి)

గంధం:

చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతామ్ ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమః గంధం సమర్పయామి (గంధం స్వామిపై చిలకరించాలి)

అక్షతలు:

అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాం స్తండులాన్ శుభాన్ గృహాన పరమానంద శంభుపుత్ర నమోస్తుతే ఓం శ్రీ వరసిద్ధివినాయకస్వామినేనమః అక్షతాన్ సమర్పయామి (కొన్ని అక్షతలు వేయాలి)

పుష్పాలు:

సుగన్దాని చ పుష్పాణి జాతీకుంద ముఖాచి చ ఏకవింశతి పత్రాణి, సంగృహాణ నమోస్తుతే ఓం వరసిద్ధివినాయకస్వామినేనమః పుష్పాణి సమర్పయాని (స్వామిని పూలతో అలంకరించాలి, పూజించాలి)

సింధూరం:

ఉద్యద్భాస్కర సంకాశం సంధ్యా వదఋణంప్రభో ! వీరాలంకరణం దివ్యం సింధూరం ప్రతిగృహ్యతాం !! వరసిద్ధి వినాయకాయ, సింధూర భూషణం సమర్పయామి

మాల్యం :

మాల్యాదీని సుగంధాని మాలత్యా దీనివై ప్రభో ! మాయాహృతాని పుష్పాణి ప్రతిగృహ్లిష్వ శాంకర !! వరసిద్ధి వినాయకాయ, పుష్పమాల్యాని సమర్పయామి.

నైవేద్యం

ఓం భూర్బువస్సువః తథ్సవితువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ సత్యం త్వర్తేన పరిషించామి అని నైవేద్యం చుట్టూ నీళ్ళు తిప్పాలి.

అమృతమస్తు అని పసుపు గణపతి దగ్గర నీళ్ళు వదలాలి అమృతోపస్తరణమసి అని నైవేద్యంపైన నీళ్ళు చల్లి

శ్రీ మహాగణాధిపతయే నమః నారికేళ సహిత కదళీఫల సహిత గుడోపహారం నివేదయామి అంటూ అయిదుసార్లు నైవేద్యాన్ని స్వామికి చేత్తో చూపించాలి.

ఓం ప్రాణాయస్వాహ, ఓం అపానాయస్వాహా ఓం వ్యానాయస్వాహా ఓం ఉదానాయస్వాహా ఓం నమానాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అని నీళ్ళు వదలాలి.

అమృతాపిథానమసి - ఉత్తరాపోశనం సమర్పయామి, హస్తా ప్రక్షాళయామి - పాదౌ ప్రక్షాళయామి ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి అంటూ నీళ్ళు చల్లాలి

అథాంగపూజా:

ఓం పార్వతీనందనాయ నమః | పాదౌ పూజయామి (పాదములను)

ఓం గణేశాయ నమః | గుల్ఫౌ పూజయామి (చీలమండను)

ఓం జగద్ధాత్రే నమః | జంఘే పూజయామి (మోకాలుక్రింద)

ఓం జగద్వల్లభాయ నమః | జానునీ పూజయామి (మోకాలు చిప్ప)

ఓం ఉమాపుత్రాయ నమః | ఊరూ పూజయామి (తొడలను) |

ఓం వికటాయ నమః | కటిం పూజయామి (నడుమును పూజింపవలెను)

ఓం గుహాగ్రజాయ నమః | గుహ్యం పూజయామి (మర్మ స్థానములను)

ఓం మహోత్తమాయ నమః | మేఢ్రం పూజయామి

ఓం నాథాయ నమః | నాభిం పూజయామి (బొడ్డును)

ఓం ఉత్తమాయ నమః | ఉదరం పూజయామి (పొట్టను)

ఓం వినాయకాయనమః | వక్షఃస్థలం పూజయామి (ఛాతిని)

ఓం పాశచ్ఛిదేనమః | పార్శ్వే పూజయామి (పక్కలను)

ఓం హేరంబాయ నమః | హృదయం పూజయామి (హృదయము)

ఓం కపిలాయనమః | కంఠం పూజయామి (కంఠమును)

ఓం స్కందాగ్రజాయ నమః | స్కంధౌ పూజయామి (భుజములను)

ఓం హరసుతాయ నమః | హస్తౌ పూజయామి (చేతులను)

ఓం బ్రహ్మచారిణే నమః | బాహున్ పూజయామి (బాహువులను)

ఓం సుముఖాయ నమః | ముఖం పూజయామి (ముఖమును)

ఓం ఏకదంతాయ నమః | దంతౌ పూజయామి (దంతములను)

ఓం విఘ్ననేత్రే నమః | నేత్రే పూజయామి (కన్నులను)

ఓం శూర్పకర్ణాయనమః | కర్ణౌ పూజయామి (చెవులను)

ఓం ఫాలచంద్రాయనమః | లలాటం పూజయామి (నుదురును)

ఓం నాగాభరణాయనమః | నాసికాం పూజయామి (ముక్కును)

ఓం చిరంతనాయ నమః | చుబుకం పూజయామి (గడ్డము క్రింది భాగమును)

ఓం స్థూలోష్ఠాయ నమః | ఓష్ఠౌ పూజయామి (పై పెదవిని)

ఓం గళన్మదాయ నమః | గండే పూజయామి (గండమును)

ఓం కపిలాయ నమః | కచాన్ పూజయామి (శిరస్సు పై రోమములున్న భాగమును)

ఓం శివప్రియాయై నమః | శిరః పూజయామి (శిరస్సును)

ఓం సర్వమంగళాసుతాయ నమః | సర్వాణ్యంగాని పూజయామి (సర్వ అవయవములను)

ఏకవింశతి పత్ర పూజ (21 ఆకులు) (ఓకొక్క నామం చదువుతూ పత్రాలతో స్వామిని పూజించాలి)

ఓం సుముఖాయ నమః - మాచీపత్రం పూజయామి

ఓం గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి (వాకుడు)

ఓం ఉమాపుర్తాయ నమః - బిల్వపత్రం పూజయామి (మారేడు)

ఓం గజాననాయ నమః - దుర్వాయుగ్మం పూజయామి (గరికె)

ఓం హరసూనవే నమః - దత్తూరపత్రం పూజయామి (ఉమ్మెత్త)

ఓం ఒంబోదరాయ నమః - బదరీపత్రం పూజయామి (రేగు)

ఓం గుహాగ్రజాయ నమః - అపామార్గపత్రం పూజయామి (ఉత్తరేణి)

ఓం గజకర్ణాయ నమః - వటపత్రం పూజయామి (మర్రి)

ఓం ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి (మామిడి)

ఓం వికటాయ నమః - కరవీరపత్రం పూజయామి (గన్నేరు)

ఓం భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామి

ఓం వటవే నమః - దాడిమీపత్రం పూజయామి (దానిమ్మ)

ఓం సర్వేశ్వరాయ నమః - దేవదారుపత్రం పూజయామి

ఓం ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి (మరువం)

ఓం హేరంబాయ నమః - సింధూవారపత్రం పూజయామి (వావిలి)

ఓం శూర్పకర్ణాయ నమః - జాజీపత్రం పూజయామి

ఓం సురాగ్రజాయ నమః - గండకీపత్రం పూజయామి

ఓం ఇభవక్తాయ నమః - శమీపత్రం పూజయామి (జమ్మి)

ఓం వినాయకాయ నమః - అశ్వత్థపత్రం పూజయామి (రావి)

ఓం సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి (మద్ది)

ఓం కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి (తెల్లజిల్లేడు)

ఓం శ్రీ గణేశ్వరాయ నమః - ఏకవింశతిపత్రాణి పూజయామి

ఏకవింశతి పుష్ప పూజ – (21 పుష్పాలు)

ఓం పంచాస్య గణపతయే నమః | పున్నాగ పుష్పం సమర్పయామి

ఓం మహా గణపతయే నమః | మందార పుష్పం సమర్పయామి

ఓం ధీర గణపతయే నమః | దాడిమీ పుష్పం సమర్పయామి

ఓం విష్వక్సేన గణపతయే నమః | వకుళ పుష్పం సమర్పయామి

ఓం ఆమోద గణపతయే నమః | అమృణాళ(తామర) పుష్పం సమర్పయామి

ఓం ప్రమథ గణపతయే నమః | పాటలీ పుష్పం సమర్పయామి

ఓం రుద్ర గణపతయే నమః | ద్రోణ పుష్పం సమర్పయామి

ఓం విద్యా గణపతయే నమః | ధత్తూర పుష్పం సమర్పయామి

ఓం విఘ్న గణపతయే నమః | చంపక పుష్పం సమర్పయామి

ఓం దురిత గణపతయే నమః | రసాల పుష్పం సమర్పయామి

ఓం కామితార్థప్రద గణపతయే నమః | కేతకీ పుష్పం సమర్పయామి

ఓం సమ్మోహ గణపతయే నమః | మాధవీ పుష్పం సమర్పయామి

ఓం విష్ణు గణపతయే నమః | శమ్యాక పుష్పం సమర్పయామి

ఓం ఈశ గణపతయే నమః | అర్క పుష్పం సమర్పయామి

ఓం గజాస్య గణపతయే నమః | కల్హార పుష్పం సమర్పయామి

ఓం సర్వసిద్ధి గణపతయే నమః | సేవంతికా పుష్పం సమర్పయామి

ఓం వీర గణపతయే నమః | బిల్వ పుష్పం సమర్పయామి

ఓం కందర్ప గణపతయే నమః | కరవీర పుష్పం సమర్పయామి

ఓం ఉచ్ఛిష్ఠ గణపతయే నమః | కుంద పుష్పం సమర్పయామి

ఓం బ్రహ్మ గణపతయే నమః | పారిజాత పుష్పం సమర్పయామి

ఓం జ్ఞాన గణపతయే నమః | జాతీ పుష్పం సమర్పయామి

ఏకవింశతి దూర్వాయుగ్మ పూజా – (రెండు దళములు కలిసిన గరిక)

ఓం గణాధిపాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి

ఓం పాశాంకుశధరాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి

ఓం ఆఖువాహనాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి

ఓం వినాయకాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి

ఓం ఈశపుత్రాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి

ఓం సర్వసిద్ధిప్రదాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి

ఓం ఏకదంతాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి

ఓం ఇభవక్త్రాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి

ఓం మూషకవాహనాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి

ఓం కుమారగురవే నమః | దూర్వాయుగ్మం సమర్పయామి

ఓం కపిలవర్ణాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి

ఓం బ్రహ్మచారిణే నమః | దూర్వాయుగ్మం సమర్పయామి

ఓం మోదకహస్తాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి

ఓం సురశ్రేష్ఠాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి

ఓం గజనాసికాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి

ఓం కపిత్థఫలప్రియాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి

ఓం గజముఖాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి

ఓం సుప్రసన్నాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి

ఓం సురాగ్రజాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి

ఓం ఉమాపుత్రాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి

ఓం స్కందప్రియాయ నమః | దూర్వాయుగ్మం సమర్పయామి

ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః నానావిధ పత్ర పుష్పాణి సమర్పయామి

అష్టోత్తరశతనామ పూజ

శ్రీ వినాయక అష్టోత్తరశతనామావళీ | (అష్టోత్రం చదవండి)

ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి |

బిల్వం :

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుషం ! త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం !! వరసిద్ధి వినాయకాయ, బిల్వపత్రం సమర్పయామి

ధూపం

దశాంగం గుగ్గులోపేతం సుగంధి సుమనోహరమ్ ఉమాసుత నమస్తుభ్యం గృహానవరదోభవ దూపమాఘ్రపయామి (అగరవత్తుల ధూపం స్వామికి చూపించాలి)

దీపం :

సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోతితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే దీపం దర్శయామి (దీపాన్ని స్వామికి చూపించాలి)

నైవేద్యం:

మహానివేదన (పిండివంటలు, అన్నం, పానకం, వడపప్పు, కుడుములు, ఉండ్రాళ్లు, కొబ్బరికాయ, అరటిపండ్లు స్వామి ముందుంచాలి)

శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః మహానైవేద్యం సమర్పయామి ఓం భూర్భువస్సువః తథ్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ అని నైవేద్యంపై నీళ్ళు చల్లాలి సత్యం త్వర్తేన పరిశించామి నైవేద్యం చుట్టూ నీళ్ళు తిప్పాలి అమృతమస్తు ... స్వామి దగ్గర నీళ్ళు వదలాలి అమృతోపస్తరణమసి అని నైవేద్యంపైన నీళ్ళు చల్లి ఈ కింది మంత్రాలు చదువుతూ అయిదుసార్లు చేత్తో నైవేద్యాన్ని స్వామికి చూపించాలి.

ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయస్వాహా ఓం ఉదానాయస్వాహా ఓం సమానాయ స్వాహా, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (స్వామి దగ్గర నీళ్ళు చల్లాలి) అమృతాపిధానమసి, ఉత్తరాపోశనం సమర్పయామి.

హస్తా ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి సమర్పయామి అంటూ నీళ్ళు వదలాలి ముఖే శుద్దాచమనీయం

పానీయం:

మహాస్వాద్యమిదం దివ్యం పానీయంతే నిషేదితం ! మయాభాక్త్యా శివాపుత్ర గృహాణ గణనాయక !!

తాంబూలం

పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహతామ్ తాంబూలం సమర్పయామి (తమలపాకులు, వక్క, పండు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని వినాయకుడి విగ్రహం ముందు ఉంచాలి)

నీరాజనం:

(లేచి నిల్చుని ఈ మంత్రంతో హారతి ఇవ్వాలి) ఘ్రుతవర్తి సహస్రశ్చ కర్పూరశకలైస్తథా నీరాజనం మయాదత్తం గృహానవరదోభవ నీరాజనం సమర్పయామి (హారతి పాత్రపై కొంచెం నీళ్ళు వదిలి, కుంకుమ పెట్టి హారతిని కళ్ళకు అద్దుకోవాలి)

మంత్రపుష్పం:

(నిలుచుని చేతిలో పువ్వులు అక్షతలు తీసుకుని చదవాలి) తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి: ప్రచోదయాత్ శ్రీ మహాగణాధిపతయే నమః మంత్రపుష్పం సమర్పయామి

ప్రదక్షిణ:

యానికానిచ పాపాని జన్మాన్తరకృతానిచ! తాని తాని ప్రణశ్యన్తి ప్రదక్షిణం పదేపదే!! అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మామ! తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష గణాధిప!! అనేక ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి!! (ప్రదక్షిణ చేసి సాష్టాంగ ప్రణామం చేయాలి)

ఆ తరువాత మళ్ళీ కూర్చుని కొన్ని అక్షితలు చేతిలోకి తీసుకోవాలి. కొంచెం నీటిని అక్షితలపై వేసుకుని ఈ శ్లోకం చెప్పుకోవాలి.

మంత్రహీనం క్రియాహీనం శక్తిహీనం మహాప్రభో యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే

అనయా ధ్యానమావాహనాది షోడశోపచార పూజయాచ, అష్టోత్తర నామర్చనయాచ, అవసర, మహా నివేదన యాచా భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తు.

శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు ఏతత్పలం పరమేశ్వరార్పణమస్తు అంటూ అక్షతలనూ నీటినీ పళ్ళెంలో వదలాలి.

పూజాక్షతలు శిరసున ధరించాలి.

వినాయకుని దండకము:

శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీస్తోత్ర, సత్సుణ్యచారిత్ర, భద్రేభవక్తా మహాకాయ, కాత్యాయనీనాథ సంజాత స్వామీ శివా సిద్ధివిఘ్నేశ, నీ పాదపద్మంబులన్, నీదు కంఠంబు నీబొజ్జ నీమోము నీ మౌళి బాలేందు ఖండంబు నీనాల్గు హస్తంబులు న్నీ కరాళంబు నీ పెద్ద వక్త్రంబు దంతంబు నీ పాద హస్తంబు లంబోదరంబున్ సదామూషికాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగయజ్ఞోపవీతంబు నీ భవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీగంధమున్ గుంకుమం బక్షతల్ జూజులున్ చంపకంబుల్ తగన్ నీ మొల్లలు న్మంచి చేమంతులున్ తెల్ల గన్నేరులున్ మంకెనల్ పొన్నలున్ పువ్వులున్మంచి దూర్వంబుళం దెచ్చి శాస్త్రో క్తరీతిన్ స్సమర్పించి పూజించి సాష్టాంగంమున్ జేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయ పొన్నంటి పండ్లున్ మరిస్మంచివౌ ఇక్షుఖండంబులన్ రేగుబండ్లప్పడాల్ వడల్ నేటి బూరెల్ మరిన్ గోధుమప్పంబుల్ న్వడల్ పున్గులన్ గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ తేనెయుం జున్ను బాలజ్యమున్నాను బియ్యంబు చామ్రంబు బిల్వంబు కుడుముల్ వడపప్పు

పానకంబున్ మేల్ బంగరున్ బళ్ళెమందుంచి నైవేద్యమునర్పించి నీరాజనంబున్ నమస్కారముల్టేసి విఘ్నేశ్వరా నిన్ను బూజింపకే యన్యదైవంబులన్ బ్రార్థన ల్చేయుటల్ కాంచనం బోల్లకే యున్ముడా గోరుచందంబు గాదే! మహాదేవ యో భక్తమందార యో సుందరకార యో భాగ్య గంభీర యో దేవచూడామణీ లోకరక్షామణి బంధుచింతామణి స్వామి నిన్నెంచ నేనంత నీ దాస దాసాది దాసుండ శ్రీ దొంత రాజాన్వయుండ రామాభిధానుండ నన్నిప్పుడు చేపట్టి సుశ్రేయునిం జేసి శ్రీమంతుగన్ జూచి హృత్పద్మ సింహాసనారూఢతన్ నిల్చి కాపాడుటే కాదయ నిన్ గొల్చి ప్రార్థించు భాక్తాళికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్ పాడియున్ బుత్రపౌత్రాభివృద్ధిన్ దగన్ గల్గగా జేసి పోషించు మంటిన్ గృపన్ గావుమంటిన్ మహాత్మా యివే వందనంబుల్ శ్రీగణేశా నమస్తే నమస్తే నమః

విఘ్నేశ్వరుని మంగళ హారతులు:

శ్రీ శంభుతనయునకు సిద్ధిగణనాథయనకు వాసిగల దేవతా వంద్యునకును ఆనరస విద్యలకు ఆదిగురువైనట్టి భూసురోత్తమ లొకపోజ్యూనకును

జయ మంగళం !!

నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చెంగల్వ ఉత్తరేణు వేరువేరుగా దెచ్చి వేడ్కతోబూజింతు పర్వమున దేవగణపతికి నిపుడు

జయ మంగళం !!

సుస్థిరముగా భాద్రపద శుద్ధచవితియందు పొసగ సజ్జనులచే పూజ గొనుచు శశి జూడరాదన్న జేకొంటి నొక వ్రతము పర్వమున దేవగణపతికి నిపుడు

జయ మంగళం!!

ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళమీదికి దండు పంపు! కమ్మని నెయ్యుయును కడయ ముద్దపప్పును బోజ్జవిరుగగ దినుచు పొరలుకొనుచు

జయ మంగళం!!

వెండి పళ్ళెములోన వేయివేయి ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి మెండగను హారమూ మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళారతి

జయ మంగళం!!

పువ్వులను నిను గొల్తు గందాల నిను గొల్తు కస్తూరిని ! ఎప్పుడు నిను గొల్తు ఏకచిత్తమ్మున పర్వమున దేవగణపతి నిపుడు

జయ మంగళం !!

ఏకాదంతంబున ఎల్లగజవదనంబు బాగైన తొండంబు వలపు కదపు ! జోకయిన మూషికము పరుగునెక్కాడుచు భవ్యుడగు దేవగణపతికి నిపుడు

జయ మంగళం !!

మంగళము మార్తాండతేజునకు మంగళము సర్వజ్ఞవందితునకు !

మంగళము ముల్లోకా మహితసంచారనకు మంగళము దేవగణపతికి నిపుడు జయ మంగళం నిత్య శుభమంగళం !!

వినాయక వ్రత కథ

వినాయక ఉద్భవం

వినాయక వ్రత కథ చదివేవారు, పూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి. పూర్వం చంద్ర వంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని, పోగొట్టుకుని.. భార్య, సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది రుషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహామునిని దర్శించి.. తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం, వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకున్నాడు. అంతట ఆ సూతమహర్షి.. శకల శుభాలను ఒసగే వినాయక చవితి వ్రతం గురించి వివరించారు. విఘ్నేశ్వరోత్పత్తి, చంద్రదర్శన దోషకారణం, శాపమోక్షం గురించి ఆ మహాముని ఇలా చెప్పసాగేను. గజాసురుడనే రాక్షసుడు తన తపస్సుచే పరమేశ్వరుడ్ని మెప్పించి.. తనను ఎవరూ వధించజాలని శక్తిని ప్రసాదించమని కోరాడు. ఆపై శివుడు తన ఉదరమునందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు. దీంతో అసరుడు అతడు అజేయుడైనాడు.

తన భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీ దేవికి చాలా దుఃఖితురాలైంది.. దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్లి విష్ణువును తన భర్తను విడిపించు ఉపాయం చెప్పమని కోరింది. విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి.. నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్లినాడు. గంగిరెద్దును ఆడించి గజాసరుడ్ని మెప్పించాడు ఈ ఆనందంలో ‘ఏమి కావాలో కోరుకో’ అని గజాసరుడు అనగా.. అదే సమయం కోసం ఎదురుచూస్తోన్న శ్రీమన్నారాయణుడు.. నీ ఉదరమందున్న శివుడ్ని తమ వశం చేయమని అడిగాడు. తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా కుక్షియందున్న శివుని ఉద్దేశించి ‘ప్రభూ శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగియుచున్నది.. ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు.. నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు. నందీశ్వరుడు ఉదరమును చీల్చి శివునికి విముక్తి కల్గించాడు. శివుడు గజాసురుని శిరస్సు, చర్మం తీసుకొని స్వస్థానోన్ముఖుడైనాడు.

తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీమహావిష్ణువు విముక్తి కల్పిచడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది. శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగుపిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారుచేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది.

గణాధిపత్యం

దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్లింది. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు....ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీ దేవి, జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు...గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు.

సర్వవిఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు, మునులు, మానవులు పరమశివుని కోరతారు. ఈ విషయంలో గణపతి, కుమారస్వామి ఎవర్ని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు.. ముల్లోకాలలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు. దీంతో కుమారస్వామి తన నెమలివాహనంపై రువ్వున ఎగిరిపోగా.. వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదల్లేడు. దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. ఆవిధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్లి, మహిమాన్వితుడైన అన్నగారికే ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరతాడు. ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు.

గణేశుడి శక్తి సామర్ధ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్లు, కుడుములు, పిండివంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడి నడవటానికి ఇబ్బందిపడుతూ కైలాసం చేరుకున్నాడు.

శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు.. గణనాథుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు. రాజ‌దృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయి అనేది నానుడి.. విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతి దేవి.. పాపాత్ముడా నీ దృష్టిసోకి నా కుమారుడు అచేతనంగా పడివున్నాడు.. కాబట్టి నిన్నుచూసివారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక అని శపించింది.

ఋషి పత్నులకు నీలాపనిందలు

పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తఋషులు భార్యలతో కలసి యజ్ఞం చేస్తూ, అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక, శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషి పత్నుల రూపంలో అగ్నిదేవుడిని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రమపడిన సప్తఋషులు, వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్థుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వ‌తీదేవితో ‘అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది. కావున శాపాన్ని ఉపసంహరించుకో’ అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి ‘ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు’ అని శాపాన్ని సవరించింది. ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి, సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది.

శమంతకోపాఖ్యానం

ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని ఓ నారద మహర్షి కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక ‘స్వామీ! ఈ రోజు వినాయక చవితి. పార్వతి శాపం కారణంగా చంద్రుని చూడకూడదు. నేను వెళ్తాను’ అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు. రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోట కరచుకుని పోతూన్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు.

శమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషంవల్ల తన మీద నింద పడిందనుకున్నాడు. శమంతకమణిని వెదుకుతూ అడవికి వెళ్లాడు. ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి. వెదుకుతూ వెళ్లి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి, దానిని తీసుకుని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడ్వసాగింది. కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు.

ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో ‘మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మావంటి వారికి ఏది గతి?’ అన్నారు. ‘భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి, ఆరోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ నాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు.ఈ కథను చదివి గాని, విని గాని తలపై అక్షతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి, సాష్టాంగ నమస్కారాలు చేయాలి.

కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి... అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి.

ఉద్వాసన మంత్రము :

యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రధమాన్యాసన్ ! తేహనాకంమహిమానస్సచంతే యాత్ర పూర్వేసాధ్యాస్సంతిదేవాః !!