మూఢమి మరియు కర్తరి తేదీలు, సమయాలు.
డొల్లు/చిన్న కర్తరీ : తేది 4-మే-2026, రా. 9:53 ని॥లకు శ్రీ పరాభవ సం।। వైశాఖ బహుళ తదియ, సోమవారం, జ్యేష్ఠా నక్షత్రము రోజున, రవి భరణీ నక్షత్రం 3వ పాదంలో ప్రవేశించడంతో డొల్లు కర్తరీ ప్రారంభం
నిజ/పెద్ద కర్తరీ : తేది 11-మే-2026, రా. 7:15 ని॥లకు శ్రీ పరాభవ సం॥ వైశాఖ బహుళ దశమి, సోమవారం, శతభిషా నక్షత్రము రోజున, రవి కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించటంతో నిజకర్తరి ప్రారంభం.
కర్తరీ ఆఖరు : తేదీ 28-మే-2026, రా.తె.2:40 ని॥లకు శ్రీ పరాభవ సం।। అధిక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి, గురువారం, స్వాతి నక్షత్రము రోజున, రవి రోహిణీ నక్షత్రం 2వ పాదంలో ప్రవేశించడంతో కర్తరీ త్యాగమగును.
మృద్దారుశిలా గృహకర్మాణి వర్ణయేత్ ఈ కర్తరీ రోజులలో మట్టిపనులు, కర్రపసులు, రాళ్ళ పనులు, ఇంటి నిర్మాణపు పనులు ప్రారంభము, శంఖుస్థాపనాదులు చేయకూడదు. (గృహ ప్రవేశములు చేయవచ్చును.)
గురు మూఢమి
* తేదీ 9-జులై-2026, రా. 7:08 ని॥లకు, శ్రీ పరాభవ సం॥, నిజ జ్యేష్ఠ బహుళ దశమీ, మంగళవారం, భరణీ నక్షత్రం, గురువు పుష్యమీ నక్షత్రం 2వ పాదమందు ఉండగా పశ్చిమ దిశలో అస్తమించుట వలన గురుమౌఢ్యం ప్రారంభం.
* తేదీ 14-ఆగస్టు-2026, రా.తె.5:13 ని॥లకు, శ్రీ పరాభవ సం।।, శ్రావణ శుద్ధ తదియ, శుక్ర/శనివారం, ఉత్తరా నక్షత్రం, గురువు పుష్యమీ నక్షత్రము 4వ పాదమునందు ఉండగా తూర్పుదిశలో ఉదయించుట వలన, గురుమౌఢ్యం పూర్తగును.
శుక్ర మౌఢ్యమి
* తేదీ 13-అక్టోబర్-2026, రా. 5:59 ని॥లకు, శ్రీ పరాభవ సం।।, ఆశ్వీయుజ శుద్ధ తదియ, మంగళవారం, విశాఖ నక్షత్రము, శుక్రుడు స్వాతీ నక్షత్రము 2వ పాదమందు ఉండగా పశ్చిమ దిశలో అస్తమించుట వలన శుక్రమౌఢ్యం ప్రారంభం.
◆ తేదీ. తేదీ 30-అక్టోబర్-2026, రా.తె. 5:32 ని॥లకు, శ్రీ పరాభవ సం॥, ఆశ్వీయుజ బహుళ పంచమీ, గురు/శుక్రవారం, మృగశిరా నక్షత్రము, శుక్రుడు చిత్త 3వ పాదమందుండగా తూర్పుదిశలో ఉదయించుట వలన, శుక్రమౌఢ్యం పూర్తగును.
అధిక మాస నిర్ణయం
ఈ సంవత్సరం 17-మే-2026 నుండి, 15-జూన్-2026 వరకు అధిక జ్యేష్ఠమానం ఉంది. పై సంవత్సరంలో అధికమాసం లేదు.