సంస్కృతం

సంస్కృత తేదీల పేర్లు, నైవేద్యాలు, ప్రసాదాలు మరియు పుష్పాల వివరాలు. ఎడమవైపు అంశాన్ని ఎంచుకుంటే కుడివైపు వివరాలు కనిపిస్తాయి.

సంస్కృత వారాల పేర్లు
నివేదనల పేర్లు
ప్రసాదములు పేర్లు
పుష్పాల పేర్లు
పుష్పములు - వాటి ఫలితాలు

సంస్కృత వారాల పేర్లు

1. ఆదివారము = భానువారము

2. సోమవారము = ఇందువారము

3. మంగళవారము = భౌమవారము

4. బుధవారము = సౌమ్యవారము

5. గురువారము = బృహస్పతివారము/గురువారము

6. శుక్రవారము = భృగువారము

7. శనివారము = స్థిరవారము/మందవారము

తెలుగు సంస్కృతం — అన్ని విభాగాలు

సంస్కృత వారాల పేర్లు

1. ఆదివారము = భానువారము

2. సోమవారము = ఇందువారము

3. మంగళవారము = భౌమవారము

4. బుధవారము = సౌమ్యవారము

5. గురువారము = బృహస్పతివారము/గురువారము

6. శుక్రవారము = భృగువారము

7. శనివారము = స్థిరవారము/మందవారము

నివేదనల పేర్లు

1. చూతఫలం = మామిడిపండు

2. ఖర్జూర = ఖర్జూరం

3. నింబ = వేప

4. నారింగ = నారింజ

5. భల్లాతకీ = జీడిపప్పు

6. బదరీ = రేగు

7. అమలక = ఉసిరికాయ

8. శుష్కద్రాక్ష = కిస్మిస్

9. అమృత లేక బీజాపూరం = జామపండు

10. ఇక్షుఖండం = చెఱకుముక్క

11. కదళీఫలం, రంభా ఫలం = అరటిపండు

12. నారికేళం = కొబ్బరికాయ

13. జంభీర = నిమ్మ పండు

14. దాడిమీ = దానిమ్మపండు

15. సీతాఫలం / బహుబీజ ఫలం = సీతాఫలం

16. రామఫలం = రామఫలము

17. కపిత్త = వెలగ పండు

18. శ్రీ ఫలం, బిల్వఫలం = మారేడు

19. మాదీ ఫలం = దబ్బ పండు

20. జంభూఫలం = నేరేడు

21. వాతాదం = బాదము పప్పు

22. సేవం/ సీమ ఫలం/ కాశ్మీర ఫలం = ఆపిల్

ప్రసాదములు పేర్లు

1. కుశలాన్నం = పులగం

2. చిత్రాన్నం = పులిహోర

3. క్షీరాన్నం = పరమాన్నం

4. పాయసం = పాయసం

5. శర్కరాన్నం = చక్కెరపొంగలి

6. మరీచ్యన్నమ్ = కట్టు లేదా మిరియాలపొంగలి

7. దధ్యోదనం = పెరుగు అన్నము

8. తిలాన్నం = నువ్వులపొడితో చేసిన అన్నం

9. శాకమిశ్రితాన్నం = కిచిడీ

10. గుడాన్నం = బెల్లపు పరమాన్నం

11. సపాదభక్ష్యం = గోధుమనూకతో చేసిన ప్రసాదం

(గోధుమ నూక చీనీ నెయ్యి సమపాళ్ళలో వేసి చేసింది గాన ఆపేరు)

12. గుడమిశ్రిత ముద్గ సూపమ్ = వడపప్పు

13. గుడమిశ్రిత తండులపిష్టం = చలిమిడి

14. మధురపానీయ = పానకం

15. పృథక్ = అటుకులు

16. పృథకాపాయస = అటుకుల పాయసం

17. లాజ = పేలాలు

18. భక్ష్యం = పిండివంటలు

19. భోజ్యం = అన్నము మొదలగునవి

20. వ్యంజనం = పచ్చడి

21. అపూపం = అరిసెలు లేదా అప్పములు

22. మాషచక్రం = గారెలు

23. లడ్డుక = లాడూలు

24. మోదకం = ఉండ్రాళ్లు

పుష్పాల పేర్లు

1. సేవంతికా = చామంతి

2. సూర్యకాంతి: = పొద్దుతిరుగుడు

3. మాలతీ = మాలతీ

4. వకులం = పొగడ

5. కమలం = తామర

6. జపా = మందార

7. జాతీ = జాజి

8. నవమల్లికా = విరజాజి

9. పాటలం = గులాబీ

10. నక్షత్ర సేవంతికా = నక్షత్ర చేమంతి

11. కురవకం = గోరింట

12. ప్రతాపన: = తెల్లమందారం

13. శిరీషం = దిరిశెన పువ్వు

14. ఉత్పలం = కలువపువ్వు

15. అంభోజం = తామర

16. సితాంభోజం = తెల్ల తామర

17. కుశేశయం = నూరు వరహాలు

18. కరవీరం = గన్నేరు

19. నలినం = లిల్లీ

20. శేఫాలికా = వావిలి

21. పున్నగం = పొన్న పువ్వు

22. అంబష్టం = అడివి మల్లె

23. జాతీ సుమం = సన్న జాజి

24. గుచ్చ పుష్పం = బంతి

25. కేతకీ = మొగలి

26. కర్ణికారం = కొండ గోగు

27. కోవిదారం = దేవకాంచనము

28. స్థలపద్మం = మెట్ట తామర

29. బంధూకం = మంకెన

30. కురంటకం = పచ్చ గోరింట

31. పీత కరవీరం = పచ్చ గన్నేరు

32. గుచ్చ మందారం = ముద్ద మందారం

33. చంపకం = సంపెంగ

34. కుందం = మల్లె

35. పుష్ప మంజరీ = పూలవెన్ను

పుష్పములు - వాటి ఫలితాలు

ఏ పూలతో పూజ చేస్తే ఏ విధమైన ఫలితాలు లభిస్తాయి :

దేవుడికి మనం పూజ చేసేటప్పుడు ఈ పూలు వాడొచ్చా లేదా ఏ పూలు వాడితే మంచిదని చాలా ఆలోచిస్తాం. కానీ ఎక్కువగా అందుబాటులో ఉన్న పూలను మాత్రమే పూజకు ఉపయోగిస్తాం.

మనం చేసే పూజకు ప్రతిఫలం దక్కాలంటే ఖచ్చితంగా నియమాలను పాటించాలి. వాడాల్సిన పూలను మాత్రమే వాడిలి. అందుకే ఏయే దేవుడుకి ఏ పూలు వాడితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.అలాగే ఏ పూలు వాడకూడదో కూడా తెలుసుకుందాం.

మనం ఏ దేవుడినైతే పూజ చేస్తున్నామో ఆ దేవుడికి ఇష్టమైన పూలు వాడటం మరింత మంచిది.దేవుడిని ఎంత సంతృప్తి పరిస్తే మనకు అంత మంచి జరుగుతుంది.

దేవునికి విడి పూల కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేస్తేనే ప్రత్యక ఫలితం లభిస్తుంది. దేవునికి వేసే పుష్పాలు విచ్చుకున్నట్లు అయితే మీ జీవితం భవిష్యతు బాగుంటుంది.

1. జాజి పూలు - మీలో ఉన్న దుష్టగుణాలు తొలగి, మంచి గుణం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారి సమస్యలు తొలగిపోతాయి.

2. సంపెంగ పూలు - శత్రువుల భాద నివారణ సాధ్యం అవుతుంది

3. పారిజాత పూలు - కాల సర్ప దోషం నివారించబడి మనస్సుకు శాంతి లభిస్తుంది.

4. రుద్రాక్ష పూలు - ఎన్ని కష్టాలు వచ్చిన అంతిమ విజయం మీదే అవుతుంది.

5. మొగలి పూలు - అధికారంలో ఉన్నవారి మనస్తాపాలు పరిహరించబడుతాయి.

6. లక్కీ పూలు - భార్య పిల్లలతో కలహాలు లేకుండా సంతోషంగా ఉంటారు.

7. పద్మం లేదా కమలం - సమస్త దారిద్ర నివారణ. శ్రీమంతులు అవుతారు.

8. మల్లె పూలు - అన్ని రోగాలు నయం అవుతాయి, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.

9. గన్నేరు పూలు - కవులకు కల్పనా సాహిత్యం వృద్ది చెందుతుంది.

10. కల్హార పూలు - మీకు గుర్తింపు వచ్చి ఆకర్షణ పెరుగుతుంది.

11. పాటలీ పుష్పం - వ్యాపార వ్యవహారంలో అధిక లాభం వస్తుంది.

12. కంద పుష్పం - ముఖంలో అధికమైన తేజస్సు వస్తుంది.

13. తుమ్మ పూలు - ఈశ్వరునికి పూజ చేస్తే దేవునిఫై భక్తి అధికం అవుతుంది.

14. నందివర్ధనం పూలు - శివునికి పూజ చేస్తే జీవితంలో సుఖం,శాంతి, ప్రశాంతత లభిస్తుంది.

15. కణగాలే పుష్పం - మనస్సును పట్టి పీడిస్తున్న భయం,భీతి తొలగిపోతాయి.

16. అశోక పుష్పం - జీవితంలో, సంసారంలో ఉండే అన్ని దుఃఖాలు నాశనం అవుతాయి.

17. నల్ల కలువ పుష్పం - అన్ని రకాల శని సమస్యలు తొలగిపోతాయి.

18. పాదరి పుష్పం - అన్ని రకాల పితృ దోషాలు తొలగిపోతాయి.

19. మాలతి పుష్పం - అన్ని పాపాలు తొలగిపోతాయి.

20. పున్నాగ పుష్పం - మగ సంతానం కలుగుతుంది.

21. వకుళ పుష్పం - భూమి మరియు సొంత ఇల్లు పొందే యోగం వస్తుంది.

22. ఉత్ఫల పుష్పం - జీవితంలో అభివృద్ధి చెoదుతారు.

23. తెల్లని జిల్లేడు పూలు - రోగాలు తొలగి, ఆరోగ్య్యం సిద్దిస్తుంది.

24. ద్రోణ పుష్పం - శత్రువుల నాశన, మిత్రలాభం అవుతుంది. అధికారం ప్రాప్తిస్తుంది.

25. భందూక పుష్పం - బంధువులు క్షేమంగా ఉంటారు.

26. అగసి పుష్పం - పాపాలు తొలగిపోతాయి.

27. సురభి పుష్పం - ఇష్టార్ధం సిద్ధిస్తుంది.

28. పొద్దు తిరుగుడు పూలు - పువ్వును హోమం పూర్ణాహుతికి సమర్పిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్దిస్తాయి.

పరమేశ్వరుని పూజలకు జిల్లేడూ, గన్నేరూ, మారేడూ, తమ్మి, ఉత్తరేణు, జమ్మి ఆకులు, జమ్మి పూలు, నల్లకలువలు చాలా మంచివని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

దాసాని, మంకెన, నదంత, మొగలి, మాలతి, కుంకుమ, మద్ది ఈ పూలు పూజకు పనికి రావు, తొడిమలేని పువ్వులు పూజకు అస్సలే పనికిరావట.

అలాగే ఏ పూలు వాడకూడదో కూడా తెలుసుకుందాం :

అలాగే మహాగణపతిని తులసితోనూ, తమాల వృక్ష పుష్పాలతో సరస్వతీ దేవిని, మల్లె పూలతో భైరవుడిని, మొగలి పువ్వులతో పరమేశ్వరుణ్ణి, మారేడు దళాలతో సూర్య భగవానుడిని ఎట్టి స్థితిలోనూ పూజింపరాదు.