
ఆదివారం, 11-10-2026
మొదటి రోజు పరాశక్తి బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపురసుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అందుకే ఈ రోజున రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజచేస్తారు. త్రిశతీ పారాయణం గావిస్తారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలిగిపోతాయి. లేత గులాబీ రంగు చీరను వస్త్రముగాను, కట్టె పొంగలిని నైవేద్యముగాను సమర్పించాలి.
అలంకారం: శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి
చీర రంగు: లేత గులాబీ
పుష్పం: తుమ్మి పూలు
నైవేద్యం/ప్రసాదం: బెల్లపు పరమాన్నము
నిషిద్ధం: చల్లని వస్తువులు
ఫలితం: సద్బుద్ధి, కార్యసిద్ధి
దానం: రవికెల గుడ్డ
మంత్రం: ఐం క్లీం సౌః సౌః క్లీం ఐం నమః
పూజలో వాడే సరళ నామమంత్రం: ఓం శ్రీ బాలా త్రిపురసుందరీ దేవ్యై నమః